డివిజన్లకు స్పెషల్ ప్యాకేజీ

డివిజన్లకు స్పెషల్ ప్యాకేజీ

  • డిప్యూటీ సీఎం ను కోరిన కే ఎల్ ఆర్ 

విశ్వంభర, మహేశ్వరం : జి హెచ్ఎంసి లో విలీనమైన మహేశ్వరం నియోజకవర్గం మున్సిపల్, కార్పొరేషన్లకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి హామీ ఇచ్చారు.తన నివాసానికి  వచ్చిన ఉపముఖ్యమంత్రి భట్టి కి విలీన పురపాలకల్లో నెలకొన్న సమస్యలను కె.ఎల్.ఆర్  ప్రత్యేకంగా వివరించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు, భూ సమస్యలను భట్టి కి వివరించిన ఇంటి పన్నులు సైతం ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు, డ్రైనేజీ, నాలాలు, రోడ్లు, విద్యుత్, వాటర్, భూ సమస్యలను డివిజన్ల వారీగా ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ లో విలీనమైన మహేశ్వరం నియోజకవర్గం మున్సిపల్, కార్పొరేషన్లకు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేలా చూడాలని కోరారు.

Tags: