పెద్దమ్మ తల్లికి ఘనంగా పూజలు

పెద్దమ్మ తల్లికి ఘనంగా పూజలు

విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి లోని ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లికి గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు చేశారు.గ్రామంలోని ముదిరాజ్ కుటుంబాలకు చెందిన మహిళలతో పాటు చిన్న, పెద్దలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మాలి ముత్తయ్య మాట్లాడుతూ, చెరువులు జలకలతో ఉట్టిపడుతూ,పాడి పంటలు సమృద్ధిగా పండి,ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు గుండ్రపల్లి శంకరయ్య, లింగాల వీరయ్య, సొప్పరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags: