గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

విశ్వంభర, చింతపల్లి : గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన సంఘటన చింతపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చింతపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం చింతపల్లి గ్రామ శివారులో గల చిన్న చెరువు లో ఒకగుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించిందని తెలిపారు. 45 నుండి 50 సంవత్సరాల వయసు కలిగి మొహం గుర్తుపట్ట లేనంతగా ఉందని, ఎరుపు, నీలం రంగు గీతాలతో డిజైన్ కలిగిన ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించి బ్రౌన్ రంగు  ఫుల్ డ్రాయర్ ధరించి ఉన్నాడు. కుడి చేతికి రాగి కడియం, మెడలో తాయత్తు కలిగి, ఎత్తు సుమారు 5 అడుగులు వున్నాడు. ఎవరికైనా ఈ వ్యక్తి యొక్క  వివరాలు తెలిస్తే  చింతపల్లి ఎస్సై ముత్యాల రాంమూర్తి ఫోన్ నెంబరుకు 8712670230, 8712675858 సమాచారం ఇవ్వగలరని తెలిపారు.

Tags: