నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి 

  • బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తూటుపల్లి రవికుమార్

విశ్వంభర, చింతపల్లి: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 10న తేదీన జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తూటుపల్లి రవికుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం చింతపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు దిశా నిర్దేశం చేయబోతున్నారని తెలిపారు. తెలంగాణలో మన ఐక్యతను చాటాల్సిన సమయం వచ్చిందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ఈ సభ ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు, మేధావులు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివర్ల రమేష్, కుకడపు రామకృష్ణ, వెన్నం శేఖర్, నాళ్ళ శివకుమార్, ఎర్ర వెంకటయ్య, మోర వెంకటరమణ నల్ల సైదులు, సోమరాజు ప్రదీప్, గజ్జె అభినవ్, కొప్పుల మహేష్, చెనమోని అరవింద్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/narendra-modi-should-make-the-public-meeting-a-success/article-15102

Tags: