ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం : నిర్మలా జగ్గారెడ్డి
విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓట్ల సవరణ కార్యక్రమంపై కాంగ్రెస్ బీఎల్ఏలకు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, టీజీఐఐసి చైర్‌పర్సన్, సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత బలమైన ఆయుధమని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏలు చొరవ చూపాలని సూచించారు.ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, ఈ విషయంలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ మరియు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మాట్లాడుతూ, బీఎల్ఏలు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రజలకు కూడా అవగాహన కల్పించి, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించే దిశగా కృషి చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ట్రైనర్ రాజీవ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.