జర్నలిస్టుల అభివృద్దే ధ్యేయం
విశ్వంభర, సూర్యాపేట: జర్నలిస్టుల కోసం అనునిత్యం అవిరళ కృషి చేస్తూ సంక్షేమం, అభివృద్ధి కోసం కంకణ బద్ధులైనది కేవలం టియూడబ్ల్యూజే ఐజేయు మాత్రమే అని టి యు డబ్ల్యూ జే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు లో భాగంగా విజన్ ఆంధ్ర జిల్లా బ్యూరో సంకర మద్ది సుధీర్ రెడ్డి లతోపాటు షేక్ సయ్యద్, పేర్ల గణేష్ లకు సభ్యత్వం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కల్లబొల్లి కబుర్లు ఇతర యూనియన్ల మాదిరిగా చెప్పకుండా కేవలం చెప్పింది చేయడం, ఆచరణతో అమలు చేయడం, దమ్ము, ధైర్యం ఉన్న టి యు డబ్ల్యూ జే ఐజేయు కి మాత్రమే క్రెడిట్ చెందుతుందని వివరించారు. అర్హులైన జర్నలిస్టుల అందరికీ కూడా అక్రిడిటేషన్లు అందే విధంగా జిల్లా మీడియా కమిటీలు మెజార్టీ సభ్యులుగా టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యులు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ బంటు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.