బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

  •  మంత్రి పొన్నం ప్రభాకర్

విశ్వంభర, సిద్దిపేట:బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను  నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి సాంప్రదాయం పూజ కార్యక్రమాల్లో పాల్గొని బంజారా నృత్యం చేశారు. ఈ సందర్భంగా  మంత్రి పొన్నం మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు సంత్ సేవాలాల్ మహారాజని కొనియాడారు. సుమారు 12కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుంచి సంత్ సేవాలాల్ జయంతిని  ఫిబ్రవరి 15రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న బంజారా భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత నాదేనని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునేందుకు కలిసి రావాలన్నారు. భవిష్యత్ లో జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు. కార్యక్రమంలో  హుస్నాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ ఛైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ ఛైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో ఛైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా కులపెద్దలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: