ఘనంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు - విద్యార్థులకు బుక్స్ పంపిణీ - వారణాసి శ్రీనివాసులు
On
విశ్వంభర, తెల్కపల్లి ; నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారణాసి శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెల్కపల్లి కేంద్ర ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న ఎమ్మెల్యే కు పుట్టినరోజు సందర్బంగా దేవుడికి ప్రత్యేక పూజలు జరపడం జరిగిందని, వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభిమానులు , నాయకులూ, కార్యకర్తలు పాల్గొన్నారు.



