నా రక్తం మరిగిపోతుంది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
- కేసీఆర్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యల పట్ల కవిత ఆగ్రహం
- ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ను తిడుతుంటే కూతురిగా నా రక్తం ఉడుకుతోంది
- "సభకు కేసీఆర్ రావడం తప్పనిసరి. ఆయన రాకపోతే బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం
- మళ్ళీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీశ్‌కు అవకాశం సరికాదు
- మీడియాతో చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
విశ్వంభర,హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ను తిడుతుంటే కూతురిగా నా రక్తం ఉండుకుతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కసబ్ తో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అలా మాట్లాడితే నా రక్తం మరిగిపోతుందని కవిత అన్నారు.తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈరోజు మీడియాతో మాట్లాడిన కవిత, బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. "సభకు కేసీఆర్ రావడం తప్పనిసరి. ఆయన రాకపోతే బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాలి. సభకు రాకుండా పిల్ల కాకుల గురించి మాట్లాడుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఒక కూతురిగా నా రక్తం ఉడుకుతోంది" అని కవిత చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టిన కేసీఆర్ ను ఉరి తీయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ... కేసీఆర్ ను ఒకసారి ఉరి తీయాలంటే రేవంత్ రెడ్డిని 10 సార్లు ఉరితీయాలని అన్నారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ కు రేవంత్ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారని ప్రశ్నించారు. ఇదే సమయంలో హరీశ్ రావుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే అన్నీ హరీశ్ చూసుకోవడం సరికాదని... కేసీఆర్ సభకు రావాలని వ్యాఖ్యానించారు.



