టిజి సెట్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

టిజి సెట్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

  • గంట ముందే సెంటర్ కు హాజరు కావాలి            
  • జిల్లా సమన్వయకర్త జయశ్రీ

విశ్వంభర,ఇనుగుర్తి: ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశం కొరకు ఈ నెల 22 న  నిర్వహించనున్న టిజీ సెట్ పరీక్షకు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు ఇనుగుర్తి గురుకులం ప్రిన్సిపాల్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మానుకోట జిల్లా సమన్వయకర్త జి.జయశ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు  ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం  1 గంట వరకు జరుగుతాయని తెలిపారు.  తమకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ కి ఉదయం 9:30 గంటలకు అభ్యర్థులు చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. గురుకులాల్లో ప్రవేశాల కోసం జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాలలో మొత్తం 5352 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారని వివరించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్, వాటర్ బాటిల్ , ఎగ్జామ్ పాడ్ వెంట తీసుకురావాలని ఆమె సూచించారు.

Tags: