కందులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
విశ్వంభర, చింతపల్లి: తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలం కేంద్రంలోని మార్కెట్ యార్డులో పిఎసిఎస్ గడియ గౌరారం ఆధ్వర్యంలో సబ్ మార్కెట్ యార్డ్ చింతపల్లిలో క్వింటాల్ కు రూ. 8000 చొప్పున కందులు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నష్టపోకుండా చూసేందుకు వరి, ధాన్యంతో పాటు ఇతర వాణిజ్య పంటలు, కందులు తదితర ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ అధికారులు చెప్పిన నిబంధనల ప్రకారం రైతులు వారి సూచనలతో తాము పండించిన ధాన్యాన్ని మార్కెటుకు తరలించి నష్టపోకుండా ఉండాలన్నారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, గడియ గౌరవం పిఎసిఎస్ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, జి.రఘునాథ్ రెడ్డి, ఎంపీడీవో సుజాత, తహసిల్దార్ విజయలక్ష్మి, మండల వ్యవసాయశాఖ అధికారిని ఏవో శ్రవణ కుమారి, చింతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, స్థానిక సర్పంచ్ కాసారపు శ్వేతా శ్రీనివాస్, మల్లారెడ్డి పల్లి సర్పంచ్ నల్ల సునీత రఘుమారెడ్డి, ఉప్పరపల్లి సర్పంచ్ మేండే వెంకటయ్య యాదవ్, వింజమూర్ సర్పంచ్ యాచారం యాదగిరి గౌడ్, ప్రశాంత పూరి సర్పంచ్ కేతావత్ శ్రీను నాయక్, పోలపల్లి రాంనగర్ సర్పంచ్ దొంతగోని యాదమ్మ, తక్కల్లపల్లి సర్పంచ్ మేడపు జంగయ్య, కిష్టరాయినిపల్లి సర్పంచ్ గొడ్డటి సంతోష రమేష్, వర్కాల సర్పంచ్ కురుమేటి పుష్పలత, నసర్లపల్లి సర్పంచ్ పంబలి మాలతి వెంకటయ్య, వీరి తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరుకల వెంకటయ్య గౌడ్, ముచ్చర్ల యాదగిరి, కాయితి జితేందర్ రెడ్డి, దాసరి శ్రీనివాస్ యాదవ్, ఎల్లంకి కిషన్, ఎండి సిద్ధిక్ బాబా,ఎలిమినేటి నరసింహ పిఎసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



