ఎంబీసీ కులాలకు సంక్షేమ పథకాలు కావాలి
On
విశ్వంభర, హైదరాబాద్: ఎంబీసీ కులాలకు ప్రతేక సంక్షేమ పధకాలు ఇవ్వాలని, త్వరగా కుల సర్టిఫికెట్స్ జారీ చేయాలని ఎంబీసీ కులాల ప్రతినిధులు అధికారులను డిమాండ్ చేసారు. బిసి అభివృద్ధి అధికారి ఆశన్న హైదరాబాద్ కార్యాలయం లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నన్స్ అధికారులు డాక్టర్ జానకి , ఆశిష్ ఎంబీసీ కులాలు ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో వీరభద్రీయ కులం కేంద్ర సంఘం మాజీ అధ్యక్షులు కాటపల్లి వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి చేవ్వ శ్రీనివాస్ , డి ఎన్ టీ నాయకులు చేవ్వ చిత్తరంజన్, అధికార ప్రతినిధి బాలుమహేందర్ పాల్గొన్నారు.



