జాతరకు ముస్తాబైన శ్రీ ముత్యాలమ్మ ఆలయం
On
విశ్వంభర,ఇనుగుర్తి: ఈనెల 11న బోనాల మహా జాతరకు శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని పరిసరాలను దేవస్థానం మేనేజ్మెంట్ అందంగా ముస్తాబు చేస్తోంది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాల జాతరకు ముహూర్తం ఫిక్స్ కాగానే ఎక్కడెక్కడో ఉన్న బంధు మిత్రులందరూ జాతరకు వెళ్లాలని తహతహలాడుతూ సమాయత్త మవుతుంటారు. 11న జరిగే జాతరకు ఆ డబిడ్డలు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో గ్రామమంతా కిక్కిరిసిన భక్తజనంతో ఆనందమయ వాతావరణంలో సందడిగా ఉంటుంది.



