యూరియా అందుబాటులో ఉంచాలి     

 యూరియా అందుబాటులో ఉంచాలి     

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా పారదర్శకంగా అందించాలని, రైతులను అయోమయానికి గురిచేసే ఫెర్టిలైజర్ యూరియా యాప్ ను ఎత్తివేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ లాల్ బహుదూర్, మండల వ్యవసాయ అధికారి ఏజాజ్ అలీఖాన్ లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ  ప్రభుత్వం యూరియా విక్రయాన్ని యాప్ లో పెట్టడంతో డీలర్లు వారి దగ్గరి వారికే విక్రయిస్తుండడంతో  చిన్న, సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. మండలంలో సుమారుగా 15 వేల యూరియా బస్తాలు అవసరం పడతాయని, కలుపు తీసే వ్యవధి కూడా అయిపోతుందని, ఇంకా పది రోజులు దాటితే యూరియాతో కూడా అవసరం ఉండదని అన్నారు. వెంటనే అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని, సింగిల్ విండోలో రైతులకు యూరియా అందుబాటులో ఉంచి పారదర్శకంగా పంపిణీ చేయాలని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్, మండల కార్యవర్గ సభ్యులు కల్లూరి నాగేష్, కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, భావండ్లపల్లి బాలరాజు, శానకొండ రామచంద్రం, పల్లె సత్యం, వేముల మల్లేశం, కన్నెబోయిన రాజా లింగం, తాటిపాముల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: