అన్నదానానికి విశాఖ భక్తుడి  విరాళం

అన్నదానానికి విశాఖ భక్తుడి  విరాళం

విశ్వంభర, భద్రాచలం : భక్తి, దాతృత్వ పరంపరలకు ప్రతీకగా నిలిచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం లో శుక్రవారం విశాఖపట్నం వాస్తవ్యులు కె. అపురూప స్వామివారి నిత్య అన్నదాన కార్యక్రమానికి రూ. 1,11,116 విరాళాన్ని అందేజేశారు. దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన సాదర స్వీకార కార్యక్రమంలో అధికారులు, అర్చకులు విరాళదాతకు పూర్ణకుంభ స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రతినిధులు మాట్లాడుతూ, భక్తుల సహకారంతో అన్నదాన సేవలు నిరంతరం విస్తరిస్తున్నాయని, సమాజంలో సేవా, దాతృత్వ భావన పెంపొందించడంలో ఇలాంటి విరాళాలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కె. అపురూప మాట్లాడుతూ,  దేవస్థానం నిర్వహిస్తున్న కార్యక్రమాలు, అన్నదానం, గోశాల సేవలకు భక్తులు భారీ ఎత్తులో విరాళాలు అందించి తోడ్పాటునందించాలని కోరారు.

Tags: