శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

చేవెళ్లలో భారీ ర్యాలీ

శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

విశ్వంభర,చేవెళ్ల: ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి యువ నాయకుడు డాక్టర్ వైభవ్ రెడ్డి మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని, ఆయన అనుసరించిన లౌకికవాదం, సామాజిక న్యాయం, పరిపాలన విధానాలు నేటి తరానికి ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాణిక్య రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశభక్తి నినాదాలు, డోలు తాళాలు, సంప్రదాయ నృత్యాలతో ర్యాలీ సాగింది.శివాజీ మహారాజ్ స్ఫూర్తిని యువత అనుసరించాలని, ఆయన దేశభక్తి, ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వైభవ్ రెడ్డి పేర్కొన్నారు.

Tags: