నాటుసారా స్థావరాలపై దాడులు
On
విశ్వంబర, మహబూబాబాద్: మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోనీ అనంతారం పెద్ద తండా, సిరోలు మండలంలోని తాళ్ల సంకీసా , వశ్రాo తండా , మన్నెగూడెం, కొత్త తండాలలో సారాయి స్థావరాలపై మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పోలీసులు దాడులు నిర్వహించారు . ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎక్సైజ్ సిఐ చిరంజీవి మాట్లాడుతూ దాడుల్లో ఐదుగురిని అదుపులో కి తీసుకుని వారి పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు . 19 లీటర్ల సారాయి, 50 కిలోల బెల్లం,30 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశామని , ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే శిక్ష తప్పదని ఆయన అన్నారు. దాడుల్లో అశోక్ కుమార్, బాలరాజు, శిరీష, వెంకన్న, నరసింహారావు, ఇబ్రహీం, శ్రీనివాస్,రాజ్ కుమార్ పాల్గొన్నారు .



