రాష్ట్ర స్థాయికి పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు
విశ్వంభర, ఇనుగుర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం కప్ క్రీడా పోటీలలో మహబూబాబాద్ జిల్లా ఇనుకుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్టూడెంట్స్ సత్తా చాటారు. జిల్లా స్థాయి పోటీలలో అసాధారణ ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఆరుగురు ఎంపికయ్యారు.వాలీబాల్ క్రీడలో చిదిరాల వివేక్ అద్భుతమైన ప్రతిభ కనబరచి స్టేట్ లెవల్ కు సెలెక్టయ్యాడు. సాఫ్ట్ బాల్ పోటీలో గర్ల్స్ విభాగం నంగునూరు భార్గవి,బి.నిహారిక, బొల్లు సహస్ర, బాలుర విభాగంలో జాటోతు అజయ్, గుగులోతు రాము ఉత్తమ క్రీడా ప్రతిభను కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. ఇనుగుర్తి మండలం నుంచి ఆరుగు రు సెలెక్ట్ కావడం పట్ల మండలంలో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో బండారు పార్థసారధి, ఎంఈఓ జంగారూపారాణి సంబంధిత క్రీడాకారులను అభినందిస్తూ రాష్ట్రస్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు. సీఎం క్రీడా పోటీలలో అసాధారణ ప్రతిభ కనపరచడానికి కారణమైన ఇనుగుర్తి జడ్పీహెచ్ఎస్ ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్ ను ప్రశంసించారు. నిరంతరం క్రీడాకారులను పలు ఆటలలో ప్రేరేపిస్తూ,శిక్షణ ఇస్తూ, ప్రోత్సహిస్తూ , సూచనలిస్తూ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ప్రణయ్ కృషి అభినందనీయమని కితాబిచ్చారు.



