తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు నిధులు

తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు నిధులు

 తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల ప్రాంగణాల్లో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల ప్రాంగణాల్లో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్‌అండ్‌బీకి పనుల అప్పగింత
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను కూడా చేపట్టింది. విగ్రహాల తయారీ, ప్రతిష్టాపన కోసం మొత్తం రూ.5,80,00,000 నిధులను కేటాయిస్తూ, బడ్జెట్ విడుదల ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ పనులన్నింటినీ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. పరిపాలనాపరమైన అనుమతులు లభించడంతో, విగ్రహాల తయారీ, నమూనాల ఎంపిక, ప్రతిష్టాపన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ద్వారా ఆయా ప్రాంతాల అస్తిత్వాన్ని చాటిచెప్పాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.

Read More శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం