కార్యకర్త మృతికి సంతాపం

కార్యకర్త మృతికి సంతాపం

 విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, తుర్కపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దొడ్డి మారయ్య అనారోగ్యంతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ దొడ్డి మారయ్య మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి, నివాళులర్పించి, దహన సంస్కారాలకు ఐదువేల రూపాయల ఆర్థిక సాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసర జానారెడ్డి, తుర్కపల్లి సర్పంచ్ పిచ్చిరెడ్డి, ఉప-సర్పంచ్ మల్లయ్య, జే.వెంకన్న, ప్రశాంత్, జానయ్య, సూరయ్య, యాదగిరి, శంకర్, వెంకటచారి, సాలయ్య, నర్సింహ, కృష్ణయ్య కుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: