లబ్దిదారులకు కుట్టు మిషన్ ల పంపిణీ
On
విశ్వంభర, మోతీ నగర్: మోతీ నగర్ రాయల్ ఫంక్షన్ హాల్ లో నిరుపేద లకు కుట్టు మిషన్ లను కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ యూత్ ఐకాన్ గొట్టిముక్కల వెంకటేశ్వరరావు పంపిణీ చేసారు. 250 మంది లబ్దిదారులకు కుట్టు మిషన్ లు అందజేశారు. ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి సర్కార్ యువతకు, నిరుపేద కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని, సర్కార్ స్కీమ్ లు ప్రజలందరికీ వర్తిస్తాయని తెలిపారు.



