మంత్రి తుమ్మల పర్యటన  నేడు 

విశ్వంభర, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాకు  శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు  రానున్నారు. పాల్వంచ మండల కేంద్రంలో నిర్వహించనున్న మెగా ఆయిల్ ఫార్మ్ ప్లాంటేషన్  కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు.  అనంతరం  ఆర్ఆర్ ఫంక్షన్ హాల్​లో రైతులతో  సమావేశం కానున్నారు. మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

Tags: