కంఠమహేశ్వర ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గా పనస రమేష్ గౌడ్ ఏకగ్రీవం
విశ్వంభర,బంగారిగడ్డ:- గ్రామంలోని శ్రీ కంఠమహేశ్వర స్వామి నూతన కమిటీ కి ఛైర్మెన్ గా పనస రమేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుంకరి శ్రీకాంత్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా, బోయపల్లి రమేష్ గౌడ్ కోశాధికారిగా, మరియు కమిటీ సభ్యులు కర్నాటి నరసింహ, మాదగోని అరుణ్, సుంకరి వెంకన్న,చెన్నయ్య, పల్లె నర్సింహ,నాగరాజు, నాగార్జున,భూస్వామి, దుర్గయ్య లను ఎన్నుకోవడం జరిగింది. గ్రామంలోనీ కులం పెద్దలని గౌరవ సలహా దారులుగా నియమించుకోవడం జరిగింది. ఎన్నికలో పాల్గొన్న సర్పంచ్ బోయపల్లి సునీత శ్రీను ,సుంకరి నర్సింహా, సుంకరి చెన్నయ్య, సుంకరి యాదయ్య, మాజీ అధ్యక్షుడు బొడ్డు ముత్తయ్య, పల్లె యాదయ్య, పల్లె శంకర్, పల్లె నర్సింహ, పల్లె శ్రీను,కాటేపల్లి యాదయ్య,బోయపల్లి దశరథ,బోయపల్లి చెన్నయ్య, బోయపల్లి సైదులు, మొగుదాల గిరి, మొగుదాల లింగం, బోయపల్లి సాయి, మరియు గ్రామంలోని గౌడ సంగం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



