ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష 

 వి శ్వoభర , వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో  మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో “ఇందిరమ్మ ఇండ్లు” నిర్మాణ కార్యక్రమంపై సీఈఓ శోభారాణి  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇండ్ల నిర్మాణ పురోగతి, గ్రౌండ్ లెవెల్‌లో అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. సీఈఓ  మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణం నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రూ.5 లక్షల కు మించి  నిర్మాణం చేయకూడదని, బయట అప్పులు తీసుకొని నిర్మాణం చేయొద్దు అని అన్నారు.  భూసంబంధిత, సాంకేతిక మరియు పరిపాలనా సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఇండ్ల నిర్మాణ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి అధికారులు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పనుల  పూర్తి కోసం అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అధికారులకు అందజేశారు. ఈ సమీక్షా సమావేశంలో  మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.జలెందర్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి  సయ్యద అర్జుమాన్ బాను , పీఆర్ ఏఈ సందీప్ రెడ్డి,  ఆర్.డబ్లు.ఎస్ ఏఈ రమ్య , ఏపీఓ పరశురాములు, బి.పి. విక్రమ్   మరియు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags: