మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ

మార్చి 15లోపు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మార్చి 15లోపు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రులందరితో కాంగ్రెస్ అగ్రనాయకులు సమావేశమై, పార్టీ నిర్మాణం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సుదీర్ఘంగా చర్చించారని తెలిపారు. ఈ భేటీలో పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ప్రజలు సంక్షేమ పథకాలను ఆస్వాదిస్తున్నందునే పార్టీని ఆశీర్వదించారని, రాష్ట్రంలో 80 శాతం ప్రజలు తమకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధివిధానాల గురించి అడిగి తెలుసుకున్నారని, విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ఆసక్తి చూపారని తెలిపారు. ఇక, పార్టీలో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన రాజగోపాల్ రెడ్డి అంశంపై కూడా అగ్రనేతలతో చర్చించినట్లు పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. త్వరలోనే రాజగోపాల్ రెడ్డిని పిలిచి పార్టీ పెద్దలు మాట్లాడతారని ఆయన స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తూ చేపడతామని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.

Read More అయ్యప్ప స్వామి దీవెనలతో గణిపాక సుధాకర్ అమరావతిల పెళ్లిరోజు కార్యక్రమం