ఛత్రినాక లో  శివాజీ జయంతి వేడుకలు

ఛత్రినాక లో  శివాజీ జయంతి వేడుకలు

విశ్వంభర, చంద్రాయణ గుట్ట:  ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతిని గౌలిపుర డివిజన్ లోని ఛత్రినాక ఆటో స్టాండ్ వద్ద సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు  చంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ హైదరాబాద్ సిపిఐ కార్యదర్శి స్టాలిన్ హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఛత్రినాక పరిసర ప్రాంతాల్లో కరపత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ,  హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతిని  పురస్కరించుకొని అన్ని నియోజకవర్గాల లో వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కళ్యాణ్, అనిల్, అరుణ్, కిరణ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags: