బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత
On
విశ్వంభర, నిజామాబాద్: ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామానికి చెందిన రోహిత్ రానా అనే బాలుడు ఇటీవలే అనారోగ్యం తో బాధపడుతూ సర్జరీ కోసం నిమ్స్ హాస్పిటల్ లో చేరాడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి విన్నవించడంతో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2.5 లక్షల రూపాయల ఎల్ ఓసి కాపీని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మంత్రి సీతక్క కు ధన్యవాదాలు తెలిపారు.



