జోరుగా ఎన్నికల ప్రచారం
On
విశ్వాంభర, నిర్మల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా నిర్మల్ పట్టణం లోని 40 వ వార్డు అభ్యర్థి అడప విజయలక్ష్మి పోశెట్టి గెలుపు కోసం నిర్మల్ కాంగ్రెస్ ఇంచార్జి కుచాడి శ్రీహరి రావ్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబడి రాజేశ్వర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చింతకుంట వాడ, సోమక్షత్రియ సంగం ఏరియా, సునార్గాల్లి, బంజాయిండ్లు, పాత కష్బా స్కూల్ ఏరియా లలో విస్తృత ప్రచారం చేసారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడ్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు వేయాల్సిందింగా కోరారు. ఈ ప్రచార కార్యక్రమం లో ఎర్రవోతి రాజేందర్, అడప పోశెట్టి, అడప గణేష్, కొట్టె శేఖర్ పత్తి విగ్న తేజ, ఎంబడి రాకేష్, పెద్ద ఎత్తున మహిళలు ఆయా వాడకట్టు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.



