భ్రమరాంబ  ఆలయ హుండీ లెక్కింపు

భ్రమరాంబ  ఆలయ హుండీ లెక్కింపు

 విశ్వంభర, సంగారెడ్డి:  భీరంగూడ గుట్టపై వెలిసిన స్వయంభు  శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది సమక్షంలో లెక్కింపు చేపట్టారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం రూ. 8.6 లక్షలు కాగా , దర్శనం టికెట్లు, టెండర్లు, అన్నదానానికి వచ్చిన విరాళాలు తదితర మార్గాల ద్వారా మొత్తం రూ. 80 లక్షల  ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శశిధర్ గుప్తా తెలిపారు. దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags: