కుమారుడి వివాహానికి ఖర్గే ని ఆహ్వానించిన భట్టి
On
విశ్వంభర, డిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరుకావాల్సిందిగా కోరుతూ, వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆయనను సాదరంగా ఆహ్వానించారు.



