జోరుగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం
On
విశ్వంభర, సంగారెడ్డి: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ, ఐనోల్ 3వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంబరి స్వప్న మహేష్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పటాన్‌చెరు ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులను స్వప్న మహేష్ యాదవ్ ప్రజలకు వివరించారు. వార్డులోని డ్రైనేజీ, తాగునీరు , మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని, హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు , మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



