ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
విశ్వంభర, నెల్లికుదురు: నెల్లికుదురు మండలం నరసింహుల గూడెం యుపిఎస్ లో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు టీచర్స్ పాత్ర పోషించి తోటి విద్యార్థులకు బోధన చేశారు. అనంతరం హెచ్ఎం పద్మావతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీచర్ పాత్ర పోషించిన వారు తమ అనుభవాలను పంచుకున్నారు. హెచ్ఎం పద్మావతి మాట్లాడుతూ, నేటి బాల, బాలికలే రేపటి దేశ భవిష్యత్తు నిర్మాతలంటూ పాఠశాలలో సంబంధిత కార్యక్రమాల ద్వారా బాలికలు ఆత్మస్థైర్యంతో గొప్ప వారిగా ఎదుగాలని ఆకాంక్షిస్తూ అభినందించారు. అనంతరం బోధనలో ప్రతిభ కన పరిచిన విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. సెల్ఫ్ గవర్నమెంట్ లో డీఈవోగా నిత్యశ్రీ, ఎంఈఓ గా నవదీప్, ఉపాధ్యాయులు గా శశి దీక్షిత్,భానుశ్రీ, సునీత,గౌతమి, నందు, రణదీక్షిత్, బన్నీ, రాజేష్,కళ్యాణి,పాఠశాల ఉపాధ్యాయులు బి.శ్రీనివాస్, రమేష్,వీరేందర్, సయ్యద్, మమత, తదితరులు పాల్గొన్నారు.



