ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
విశ్వంభర, అనంతగిరి: అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగవరం గ్రామంలో బుధవారం గ్రామ పంచాయితీ కార్యాలయం దగ్గర సిరి పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను రైతులకు వివరించారు. అనంతరం సిరి ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు కిసాన్ సేవారత్న డాక్టర్ మొలుగూరి గోపయ్య మాట్లాడుతూ, భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. గత 60 సంవత్సరాలుగా చేస్తున్న రసాయన వ్యవసాయంతో భూసారం దెబ్బతిన్నదని అన్నారు నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం , పంట ఆరోగ్యమే మన ఆరోగ్యమన్నారు. సహజ సిద్ధ పద్ధతులతో భూసారం పెంచడం చీడపీడల నివారణపై ఎలాంటి పెట్టుబడులు లేకుండా పలు పద్దతులను రైతులకు వివరించారు . ఈ కార్యక్రమంలో రైతులు కొల్లు సుబ్బారావు, రేవూరి పెద వెంకటేశ్వర్లు, తెలగపల్లి సైదులు, దేవులపల్లి నరసింహరావు, రేవూరి రాంబాబు, చిప్పల రాంబాబు, పగిడి వెంకటేశ్వర్లు, అల్లు రమేష్, బొర్ర వెంకటయ్య, అక్కినపల్లి వెంకటేశ్వర్లు, గద్దె వెంకటేశ్వర్లు, కంటు చినవీరయ్య, జగన్నాధం, పుల్లప్ప,చిప్పల వెంకటయ్య, రైతులు, తదితరులు పాల్గొన్నారు.



