నకిరేకల్‌లో ఘనంగా హోలీ వేడుకలు
On
విశ్వంభర, నకిరేకల్: నకిరేకల్‌లో హోలీ సంబరాలు అంబరానాన్ని తాకాయి. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పన్నాల కూడలి నుంచి మహిళలు, యువకులు, చిన్నారులు, నాయకులు, రంగులు జల్లుకుంటూ డీజే, బ్యాండ్ వాయిద్యాలతో నృత్యాలు చేసుకుంటూ ప్రధాన కూడలికి చేరుకున్నారు. ర్యాలీలో ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రజలతో కలసి ఎమ్మెల్యే నృత్యం చేశారు. రంగులు పూసుకుంటూ సందడిగా గడిపారు. హోలీ వేడుకల్లో పురపాలిక ఛైర్‌పర్సన్ రజిత, మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ మంజుల, ఎమ్మెల్యే సతీమణి పుష్పలత, కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుకన్య, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ సీపీఎం, భాజపా నాయకులు పాల్గొన్నారు.



