బిటి రణదేవేకు ఘనంగా నివాళి

బిటి రణదేవేకు ఘనంగా నివాళి

విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి లో సిఐటియు మండల కార్యదర్శి జల్లె జయరాజ్ ఆధ్వర్యంలో సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదేవే కు సోమవారం ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ,  రాణదేవే చిన్నతనం నుండి స్థానికంగా కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించేవారనీ కమ్యూనిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించి కార్మికులను ఏకం చేసి ప్రజాసంఘాలను బలోపేతం చేశారన్నారు. కార్మికుల హక్కుల కోసం సిఐటియు కార్మిక సంఘాన్ని  స్థాపించి కార్మిక సంఘం అధ్యక్షుడిగా  రణదీవే ఎన్నికయ్యారని తెలిపారు.కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల గొడిశాల వెంకన్న,చెట్టెబోయిన యాకన్న,ఆశా వర్కర్లు స్వరూప, రాధ, సుజాత, బివి లక్ష్మి, పద్మ, లలిత, సీనమ్మ రజిత ఆశ సునీత బుజ్జి మంజుల మల్లిక, విజయ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Tags: