రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

విశ్వంభర, సిద్దిపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గడచిన రెండేళ్లలో పలు సంక్షేమ, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని, ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల ప్రభుత్వమని నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంట్, మహిళకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రాజీవ్ ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్వాలిటీ భోజనం లాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తుందన్నారు. నారాయణరావుపేట మండలం మాటిండ్ల గ్రామ ఉప సర్పంచ్ పర్శరాములు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజల హాజరై మొదట మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ గ్రామం మొత్తం కార్యక్రమానికి తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. రైతుల మేలు కోసం పెండింగ్‌లోని కాలువలను సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామంలో పెద్దమ్మగుడి వద్ద రూ.10లక్షలతో సీసీ రోడ్డు, రైతుల కోసం రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్‌వీర్ మాట్లాడుతూ నారాయణరావుపేట మండలంలో పూజల హరికృష్ణ కృషితో రోజురోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పూజల హరికృష్ణను ఎమ్యెల్యేగా గెలిపించుకుందామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు బొమ్మల యాదగిరి, మైనార్టీ రాష్ట్ర నాయకుడు ఎండీ కలిమోద్దీన్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, మండల అధ్యక్షుడు బర్మ రామచంద్రం, అర్బన్ మండల అధ్యక్షుడు భిక్షపతి, ఎఏంసీ వైస్ ఛైర్మన్ వంశీ, బిట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags: