పద్మశాలీల ఉన్నతికి సహకారం
విశ్వంభర, సిద్దిపేట : పద్మశాలి సమాజ ఉన్నతికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సాదుల పవన్ కుమార్ అన్నారు. నూతనంగా నామినేటైన సాదుల పవన్, గ్రామ కార్యదర్శి సూరం నితీశ్ కుమార్ లను పద్మశాలి సంఘం నాయకులు మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పద్మశాలీల అభివృద్ధికి తాను సంపూర్ణ సహకారం అందిస్తానని హామీనిచ్చారు. పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని సూచించారు. గ్రామ కార్యదర్శి సూరం నితీష్ కుమార్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, సమాజ పురోగతికి నిరంతరం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, రవికుమార్, రచ్చ సిద్దు, ఆకుపత్తి రాము, దాసరి రాజు, రామలింగం, బింగి రవీందర్, నరేందర్, రాజు, బొజ్జ శ్రీనివాస్, బొజ్జ మహేశ్, చిప్ప శ్రీధర్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



