ఓటర్ జాబితా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి : రామకృష్ణారెడ్డి
విశ్వంభర, పరిగి: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రారంభమైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రజలందరూ చురుకుగా పాల్గొని సహకరించాలని పరిగి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి కోరారు. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఇంటింటి ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బీఎల్‌ఓ లకు సహకరించాలని కోరారు. బీఎల్‌ఓ లు ప్రతి ఓటరు ఇంటిని మూడుసార్లు సందర్శించి వివరాలను సేకరిస్తారని తెలిపారు.బీఎల్‌ఏలు, ప్రతి ఇంటిని సందర్శించి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వివరాలను నమోదు చేస్తారని చెప్పారు. అర్హులైన ప్రతి పౌరుడు తమ వివరాలను సక్రమంగా అందించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ విజయవంతానికి తోడ్పడాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ లో ఏమైన ఇబ్బందులు వున్న ఎల్లవేళల అందుబాటులో వుండి సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ ఎ జావిద్ పాషా, జహీర్, తదితరులు పాల్గొన్నారు.