విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్ల పంపిణీ

విశ్వంభర, రామగిరి: రత్నాపూర్ గ్రామంలోని రాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో సింగరేణి కాంట్రాక్టర్ చిలువేరు వెంకటేశం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, స్లేట్స్, 40 మందికి  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిలువేరు వెంకటేశం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం ఈశ్వరి మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమని, చిలువేరు వెంకటేశం అందించిన విద్యా సామగ్రి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సతీష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-notebooks-pens-pencils-to-students/article-17354

Tags: