దోమల బెడద .. సామాన్యుల బాధ
విశ్వంభర, హైదరాబాద్ :- గ్రేటర్ లో దోమల నివారణ కోసం ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. 2020-21 సంవత్సరంలో 25 కోట్లు 2021- 22 సంవత్సరంలో 25 కోట్లు, 2022-23 , 2023- 24 లో 30 కోట్లు ప్రస్తుత బడ్జెట్లో ఇంకా ఎక్కువ ఖర్చు చేశారన్నది అంచనా. ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నామని చెబుతున్న ఇవి కేవల అంకెలకు మాత్రమే పరిమితమైనవి అని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూలర్లు టైర్లు తాగి పడేసిన కొబ్బరి బోండాలు వాటిలో నీరు చేరడం చెరువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉన్నా కూడా ఒక్క అధికారి కూడా ఇటువైపు చూసిన దాఖలాలు లేవు.
దోమల నివారణకు గత నాలుగేళ్ల క్రింద జోన్ కు రెండు చొప్పున 12 మస్కిటో ట్రాఫిక్ మిషన్లు కొన్నా ఆపరేట్ చేయకపోవడంతో మూలకు పడ్డాయి. అవి ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియదు. జిహెచ్ఎంసి పరిధిలో 134 చెరువులు ఉన్నా కూడా ఎవరు కూడా వాటి గురించి పట్టించుకోవట్లేదు. వాస్తవానికి దోమల బెడద తగ్గాలంటే, ఇక్కడ దోమల వ్యాప్తి అంతకు అంత పెరిగి జిహెచ్ఎంసి పరిధిలో వైరల్ ఫీవర్ డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. జనాల డబ్బులు లూటీ అవుతున్నాయి. ఒక్కొక్కసారి చిన్నపిల్లల ప్రాణాల మీది కూడా తెస్తున్నాయి.
ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం 300 ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయి. అయితే డివిజన్ కు రెండు యంత్రాలు కేటాయించారు. పెద్ద మిషన్లు 60 ఉన్నాయి. వీటిలో ఇవి యంత్రాలు వాడడానికి పెట్రోల్ డీజిల్ నింపుతారు. ఫాగింగ్ మెషిన్ లు వాడకపోగా ఇందులో వాడినట్టు చూపి కిందిస్థాయి అధికారులు పెట్రోల్ బయట అమ్ముకుంటున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో పెద్ద మొత్తంలో చాలామంది చేతులు మారాయని జనం అనుకోముందే అధికారులు స్పందించాలీ.
దోమల లార్వాని అంతం చేయాలి.
దోమలు ఒక్కసారి వృద్ధిలోకి వచ్చాక ఎంత ఫాగింగ్ చేసినా కూడా దోమలు చనిపోయే అవకాశం తక్కువ. అయితే ఇక్కడ చెరువులో ఏవైతే ఉన్నాయో వాటిలో గంబూసియా చేపలు (మస్కిటో ఫిష్ )ఇవి కేవలం మురికి నీళ్లలో మాత్రమే జీవిస్తాయి. వీటికి ఆహారం దోమల లార్వా కొన్ని రాష్ట్రాల్లో వీటిని దిగుమతి చేసుకొని ఇప్పటికీ వాడటం జరుగుతుంది. ఈ గంబూసియా (మస్కిటో ఫిష్ ) చేపలను దిగుమతి చేసుకొని ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసి చెరువులలో వదినట్లయితే మలేరియా డెంగ్యూ సీజన్ వ్యాధుల నుంచి ప్రజలు తప్పించుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే చుట్టూ పక్కల ప్రాంతాలతో విలీనమైన హైద్రాబాద్ భారత దేశం లోనే అతి పెద్ద నగరంగా చెప్పుకునే నేటి తరం పాలకులు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ వర్కర్స్ తో చెరువులను చుట్టుపక్కల క్లీనింగ్ చేసినప్పుడు మాత్రమే ఈ దోమలు లేకుండా ఉండే అవకాశం ఉంది. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన వాస్కోడిగామా సైతం .. చిన్న దోమ కాటుకు మలేరియా వ్యాధి తో చనిపోయాడని అధికారులు గుర్తిస్తే చాలు.
నాగోల్ చెరువు బండ్లగూడ చెరువు ప్రాంతాల్లో ఒకవైపు చెరువు దుర్వాసన మరియు దోమల బెడదకు ఎవరు కూడా సాయంత్రం తర్వాత ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రాపర్టీ టాక్స్ కట్టకపోతే మైక్ లో కరెంటు తీస్తాం, వాటర్ కట్ చేస్తామని చెప్పుకునే అధికారులు. దోమలు కూడా లేకుండా చేస్తాం చెరువులో నుంచి దుర్వాసన లేకుండా చేస్తామని మైక్ లో చెప్పుకునే రోజులు రావాలని జిహెచ్ఎంసి ప్రజలందరం ఆశిద్దాం.
BANDI JAYASAGAR REDDY .LL.B



