యాదగిరిగుట్ట ఆలయం మూసివేత
On
విశ్వంభర, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు మూసివేశారు. ప్రధానాలయంతో పాటు ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలను మూసివేశారు. బుధవారం తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేయనున్నారు. అనంతరం నిత్య పూజలు చేసి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.



