రామాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం  రూ.75 లక్షలు  విరాళం

రామాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం  రూ.75 లక్షలు  విరాళం

విశ్వంభర, సంగారెడ్డి : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  మరోమారు తన దైవభక్తిని చాటుకున్నారు. ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు తన వంతు కృషి గా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్ లగ్జూరియా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం, శివాలయాల నిర్మాణానికి 75 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. బుధవారం ఉదయం కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,  నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని కోరారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటివరకు 200కు పైగా దేవాలయాలను సొంత నిధులతో నిర్మించినట్లు గుర్తు చేశారు. పటాన్ చెరు నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీటి జలాలు అందించాలని లక్ష్యంతో నూతన రిజర్వాయర్లు, పైప్ లైన్లు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. బుధవారం  డివిజన్ పరిధిలోని ఏపీఆర్ లగ్జూరియా కాలనీలో నూతనంగా నిర్మించిన మంచినీటి సంప్ హౌస్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Tags: