మంత్రులకు ఘన స్వా గతం 

మంత్రులకు ఘన స్వా గతం 

విశ్వంభర, సంగారెడ్డి : పటాన్ చెరు లోని కర్ధనూర్ లో నూతనంగా నిర్మించతలపెట్టిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి హాజరయ్యారు. మార్గమధ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మంత్రులిద్దరికి మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ఘన స్వాగతం పలికారు. ఇద్దరికి బొకేలు అందించి శాలువలు కప్పి సత్కరించారు. పటాన్ చెరు కు సబ్ రిజిస్ట్రార్  కార్యాలయం మంజూరు చేయడంతో పాటు కర్ధనుర్ లో స్థల కేటాయింపు చేసి భవన నిర్మాణం పనులు మొదలు పెడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సబ్ రిజిస్టర్ కార్యాలయ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు ప్రయాణ భారం తగ్గడంతో పాటు సమయం రవాణా ఖర్చులు కలిసి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Tags: