రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనాలు

రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనాలు

 విశ్వంభర, నిజామాబాద్: ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నిన్న అర్ధరాత్రి సమయంలో దొంగలు గ్రామంలోకి ప్రవేశించి సుమారు 8 ఇళ్లలో, 2 కిరాణా దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బంగారం, నగదు దోచుకెళ్లినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనతో మండల వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రి వేళలో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేసి దొంగల్ని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చుట్టుపక్కల అనుమానితులు ఎవరైనా ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గుర్తు తెలియని వ్యక్తులు మీ గ్రామంలో ప్రవేశిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండని  పోలీసులు తెలిపారు. స్థానికులు ఎలాంటి భయాందోళన గురికావద్దని మీకు అండగా మేముంటాం అని భరోసా కల్పించారు

Tags: