మగ్గం వర్క్ ఏర్పాటు అభినందనీయం

మగ్గం వర్క్ ఏర్పాటు అభినందనీయం

విశ్వంభర, ఇనుగుర్తి: గ్రామీణ ప్రాంతంలో ఎంబ్రాయిడరీ కంప్యూటర్ మగ్గం వర్క్ ఏర్పాటు చేయడం అభినందనీయమని సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య అన్నారు.ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో మద్దెల నీరజ సుధాకర్ గౌడ్ దంపతులు ఏర్పాటుచేసిన ఎంబ్రాయిడరీ కంప్యూటర్ మగ్గం వర్క్ ను సర్పంచి గ్రామ ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు  మగ్గం వర్క్స్ కు సిటీకి వెళ్లవలసి వస్తుందని, డిమాండ్ దృష్ట్యా గ్రామంలోనే ఏర్పాటు చేయడం సరైన నిర్ణయమని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రోప్రైటర్ నీరజ సుధాకర్ మాట్లాడుతూ.. మంచి డిజైన్ తో నాణ్యమైన ఫ్యాషన్స్ తో ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ సరసమైన ధరలకు, నిర్దేశించిన కరెక్ట్ సమయానికి అందిస్తామని తెలిపారు.కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు,గ్రామస్తులు చెడుపాక యాకూబ్,కవిత, బైరు భద్రయ్య గౌడ్,మద్దెల యాకయ్య,బైరు యాదగిరి,వర్దోలు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: