ఇనుగుర్తి లో భక్తిశ్రద్ధలతో రంజాన్
On
విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తిలో రంజాన్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.శుక్రవారం నెలవంక దర్శనం ఇవ్వడంతో పవిత్ర రంజాన్ మాసం ముగిసిపోయింది.శనివారం వేకువ నుంచే ముస్లింలు స్థానిక ఈద్గా వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు. అల్లాహ్ కృపను కోరుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ప్రార్థనల్లో మొలిసాబ్ అబ్దుల్ రెహమాన్, మస్జిద్ ఏ అక్సా కమిటీ సదర్ సాబ్ ఎండీ అమీర్, నాయిబ్ సదర్ ఎండీ సలీమ్, కమిటీ సభ్యులు, మత పెద్దలు, వివిధ గ్రామాల ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.



