వర్కింగ్ జర్నలిస్ట్ లను తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలి .-చిత్తనూరి  శ్రీనివాస్ 

విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో జర్నలిస్ట్ ల పాత్ర  చాలా మరువ రానిది 
 జిల్లా పర్యటనకు వస్తున్న ఎమ్మెల్సీ కోదండరాం , అద్దంకి దయాకర్ అన్న లు జర్నలిస్ట్ ల విజ్ఞప్తిని పరిశీలించాలి ,  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి . ఈ సందర్భంగా మహబూబాబాద్ సీనియర్ జర్నలిస్టు టీయి డబ్ల్యూ జే ఐజే యు యూనియన్ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ప్రారంభమైన నాటి నుండి  రాష్ట్రం సాధించుకునే దాకా జరిగిన ప్రతి సంఘటనలోనూ, అన్ని సందర్భాల్లోనూ కీలకపాత్ర   పోషించిన వర్కింగ్ జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించి,  ప్రభుత్వం నుండి అందే ప్రతి ఫలాన్ని జర్నలిస్ట్ లకు అందజేయాలని  సిహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు . 
తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం నిర్వహించేందుకు నేడు  జిల్లా కేంద్రానికి వస్తున్న ఎమ్మెల్సీలు  ప్రొఫెసర్ కోదండరాం , అద్దంకి దయాకర్ లు ఈ అంశాన్ని  తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి,  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకువెళ్లాలని జర్నలిస్ట్ ల పక్షాన సిహెచ్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు . 
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైన సమయంలో అప్పటి పాలక పక్షాల , రాజకీయ పక్షాల ఒత్తిడి ను తట్టుకొని తెలంగాణ ఉద్యమం ముందుకు సాగడానికి, తెలంగాణ కోసం పోరాడే శక్తులన్నీ ఒక్కతాటిపైకి రావడానికి ఎక్కడికక్కడ  జర్నలిస్టులు తాము కూడా తెలంగాణ ఉద్యమకారులతో  పోటీపడి కష్టపడ్డారని సిహెచ్ శ్రీనివాస్ గుర్తు చేశారు.  సభలు జరిగినా,  సమావేశాలు జరిగినా,  ఉద్యమ నేపథ్యంలో బాగంగా వంటావార్పు, మానవహారం, రాస్తారోకోలు, నాఖాబందీలు,  రైలురోకోలు, సకలజనుల సమ్మె, తెలంగాణ ధూంధాం, సాగరహారం ఇలా  ఏవి జరిగినా జర్నలిస్టులు తమ వృత్తిధర్మంతో పాటు తెలంగాణ ఆకాంక్షతో నాడు పని చేశారని  గుర్తు చేశారు . ఉద్యమపోరాటాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్ళిన మహబూబాబాద్  దాడి ఘటనలో జర్నలిస్టులు చూపిన తెగువ నాటి జేఏసీ చైర్మన్  ప్రొఫెసర్ కోదండరాం కు, అద్దంకి దయాకర్ కు తెలియంది కాదని సిహెచ్ శ్రీనివాస్ మరోసారి గుర్తుచేశారు .తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఖచ్చితంగా న్యాయం జరగాలని , అదే పద్ధతిలో  తెలంగాణ సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, రాష్ట్రం సాధించేంతవరకు అలుపెరగకుండా ఉద్యమం వెంట నడిచిన, కొన్ని సందర్భాల్లో యాజమాన్యాల ఒత్తిడి లను కూడా తట్టుకుని నిలబడిన వర్కింగ్ జర్నలిస్టులందరికీ రాష్ట్రవ్యాప్తంగా న్యాయం జరిగేలా చూడాలని సిహెచ్ శ్రీనివాస్ కోరారు . 
తెలంగాణ ఉద్యమకారులకు అందే ఫలాలను, నాటి ఉద్యమ కాలంలో పనిచేసిన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అందేలా చూడాల్సిన బాధ్యత పెద్దలు కోదండరాం , అద్దంకి దయాకర్ తీసుకోవాలని  శ్రీనివాస్  విజ్ఞప్తి చేసారు .
🕒 21 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/working-journalists-should-be-identified-as-telangana-activists-chittanoori/article-16811

Tags: