27న మెగా ఆరోగ్య శిబిరం

27న మెగా ఆరోగ్య శిబిరం

విశ్వంభర, రామన్నపేట: హైదరాబాద్ యశోద హాస్పిటల్ సహకారంతో ఈనెల 27న యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో రామన్నపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు లయిన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పనకంటి భాస్కరరావు తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ మెగా ఆరోగ్య శిబిరంలో గ్రామీణ ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కక్కిరేణి, రంగమ్మ గూడెం, ఇస్కిల్లా, ఏన్నారం, ఉత్తటూరు గ్రామాల ప్రజలతోపాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసే యువత  9948670115 ను సంప్రదించి రక్తదానం చేయగలరని కోరారు.

Tags: