జీవితంలో యోగా ప్రతిఒక్కరికి తప్పనిసరి. - మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
విశ్వంభర, చండూరు: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం నాడు గాంధీజీ విద్యాసంస్థల్లో విద్యార్థులతో ఘనంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా యోగా ఆసనాలు, ప్రాణాయామాలు చేసి యోగా యొక్క విశిష్టతను చాటిచెప్పారు. గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద అని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు శారీరకంగా దృఢంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగా మాస్టర్ బోడ సాయిరాం ఆధ్వర్యంలో ముందుగా శరీరాన్ని సిద్ధం చేసే వార్మ్-అప్ వ్యాయామాలు నిర్వహించారు. అనంతరం తాడాసనం, వృక్షాసనం, త్రికోణాసనం, భుజంగాసనం, వజ్రాసనం, పద్మాసనం వంటి వివిధ యోగా ఆసనాలను అభ్యసించారు. అలాగే ప్రాణాయామం, అనులోమ-విలోమం, భ్రమరి వంటి శ్వాస వ్యాయామాలను చేసి యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపొందడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవనశైలికి యోగా ఎంతగానో దోహదపడుతుందనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ జానీ సార్, ప్రైమరీ ప్రిన్సిపల్ పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు ఉత్సాహంగా యోగా ఆసనాలు, ప్రాణాయామాలు నిర్వహించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.