జూలై 2న ఉప్పల్ భగాయత్ లో భూ పోరాటం 

జూలై 2న ఉప్పల్ భగాయత్ లో భూ పోరాటం 

విశ్వంభర/ చార్మినార్:- జులై రెండవ తేదీన ఉప్పల్ బాగాయత్ టిఆర్ఎస్ అధినేత్రి కవిత ఆధ్వర్యంలో తలపెట్టిన భూ పోరాటం కార్యక్రమం విజయవంతం చేయాలని టిఆర్ఎస్ నగర ప్రోగ్రామ్ ఇన్చార్జ్ దూగుంట్ల నరేష్ ప్రజాపతి పిలుపునిచ్చారు. చార్మినార్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన చార్మినార్ నియోజకవర్గ ఇన్చార్జ్ పి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన పత్రికా  సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నగర ప్రోగ్రామ్ ఇన్చార్జ్ ధూగుంట్ల నరేష్ ప్రజాపతి మాట్లాడుతూ... ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల భూమిని కేటాయిస్తామని మాయ మాటలు చెప్పి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కేవలం కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు ఉద్యమకారులు గా గుర్తించవలసిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను దార పోసిన ఉద్యమకారులకు ప్రభుత్వం వెంటనే 250 గజాలు ఇంటి స్థలం తో పాటు నెలకు 25000 పెన్షన్, గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన చార్మినార్ నియోజకవర్గ ఇన్చార్జ్ పి రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ కన్వీనర్ రామ గిరి,ప్రకాష్, ప్రతినిధులు బీరకాయల మధుసూదన్, గౌరీ గణేష్ తెలంగాణ రక్షణ సేన ప్రతినిధులు అంబటి రాజేష్, మణికొండ విజయ్ కుమార్, వికాస్,రాజేష్,సదానందం, రాoకోటి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

🕒 21 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/on-july-2-ground-fighting-in-uppal-bhagayat/article-16815

Tags: